
మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలు చేస్తున్న ఏడుగురు సైబర్ నేరస్థులను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కమిషనరేట్ పరిధిలో ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో నిందితులను పట్టుకున్నారు. సైబర్ బాధితులకు రూ.27,36,373 రీఫండ్ చేశారు. సైబర్ నేరస్థులు ఇన్వెస్ట్‌మెంట్ మోసం, మ్యాట్రీమోనీ, పార్ట్‌టైం జాబ్ మోసం కేసులో నిందితులను అరెస్టు చేశారు. పెండెం వంశీ, మండవ నాగేశ్వర్ రావు, చట్టు కోటేశ్వర రావు, మహ్మద్ ముస్తాఫా ఆరిఫ్ మల్బారీ, తలారీ విద్యాసాగర్, తిరుమణి భరత్ కుమార్ సైబర్ నేరాలు చేసే వారికి బ్యాంక్ ఖాతాలు ఇచ్చారు. ట్రేడింగ్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని చెప్పడంతో బాధితురాలు సైబర్ నేరస్థుల బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు. తర్వాత నుంచి డబ్బులు ఇవ్వకుండా మరింత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో మల్కాజ్‌గిరి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన నిందితులను అరెస్టు చేశారు.