
గువాహటి: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు రాణించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ కు భారత బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. ఆదిలోనే టాపార్డర్ బ్యాటర్లును పెవిలియన్ పంపి కివీస్ ను దెబ్బ కొట్టారు. ఆ తర్వాత ఫిలిప్స్(48), చప్ మన్(32)లు వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయితే, వీరిద్దరూ భారీ స్కోర్లు చేయకుండా టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు.
వీరి తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సాంట్నర్ వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో 17 బంతుల్లో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కివీస్ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. దీంతో 20 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా..రవి బిష్ణోయి, హర్దిక్ పాండ్యాలు చెరో రెండు వికెట్లు తీశారు. హర్షీత్ రాణాకు ఒక వికెట్ దక్కింది.