Reading Time: < 1 minute

భారత ప్రభుత్వం 77వ గణతంత్ర దినోత్సవం 2026 సందర్భంగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ భుల్లర్‌లను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.ఈ ఏడాది మొత్తం 131 మందికి పద్మ అవార్డులు ప్రకటించగా, అందులో 8 మంది క్రీడా రంగానికి చెందిన వారు ఉన్నారు. భారత క్రికెట్‌కు అందించిన అసాధారణ సేవలకు గానూ రోహిత్ శర్మ కు పద్మశ్రీ లభించింది. ఇటీవల 2024 టీ20 ప్రపంచ కప్ అందించడం, వన్డేల్లో రోహిత్ కు ఉనన తిరుగులేని రికార్డులను కేంద్రం గుర్తించింది. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ సాధించిన విజయాలకు గుర్తింపుగా పద్మశ్రీ వరించింది. ముఖ్యంగా ఆమె నాయకత్వంలో మహిళల క్రికెట్ స్థాయి పెరగడం విశేషం.