Reading Time: < 1 minute

హైదరాబాద్: నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మాదేనని టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూ పేరుతో బిజెపి అర్వింద్ ఎంపి అయ్యారని, దేవుళ్ల పేరుతో ఓట్లు అడిగే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదని మహేష్ తెలియజేశారు. కాంగ్రెస్.. బిజెపికి ఎంత దూరమో, మజ్లిస్ కూ అంతే దూరమని, కులమతాల పేరిట ప్రజల జీవితాలతో ఆడుకుంటే ఊరుకోమని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాలతో టికెట్లు రావు అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.