
హైదరాబాద్: మంచి సూపర్‌హిట్ సినిమా కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నాడు హీరో నితిన్. ‘బలగం’ ఫేమ్ వేణు దర్శకత్వంలో నితిన్ ‘ఎల్లమ్మ’ సినిమా చేయాల్సింది. కానీ, అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు దేవి శ్రీ ప్రసాద్ చేతిలోకి వెళ్లిపోయింది. అయితే నితిన్ కొ్త్త సినిమాను ప్రకటించాడు. ‘#NITHIIN36’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశాడు.
ఇందులో నితిన్ సిగరెట్ తాగుతూ కనిపించాడు. పోస్టర్‌పై ‘నో బాడీ, నో రూల్స్’ అని రాసి ఉండటం మనం గమనించవచ్చు. ఇక ఈ సినిమాకు విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. గతంలో విఐ ఆనంద్ తీసిన హృదయం ఎక్కడున్నది, టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఒక్క క్షణం, డిస్కో రాజా, ఊరు పేరు భైరవకోన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెన్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు నితిన్‌తో మరింత క్రేజీ కాన్సెప్ట్‌తో ఆనంద్ సినిమాను తెరకెక్కిస్తారని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా నితిన్ హిట్ కొడతాడో? లేదో? చూడాలి.
NO BODY…NO RULES
The rules of reality just changed. Very eager to start the journey with my brother @Dir_VI_Anand & @srinivasaaoffl garu 😊
@SS_Screens pic.twitter.com/hrO6GRMPvq
— nithiin (@actor_nithiin) January 25, 2026