Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను ప్రకటించింది. దేశంలోని వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులను గుర్తించి, వారికి ఈ అవార్డులను అందజేయడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో, ఈ ఏడాది మొత్తం 45 మందిని పద్మశ్రీ అవార్డు వరించింది.

తెలంగాణ నుంచి రామారెడ్డి మామిడి, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. కుమారస్వామి తంగరాజ్ సిసిఎంబి శాస్త్రవేత్త. మానవ పరిణామ క్రమం, జన్యు సంబంధ వ్యాధులపై ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. మూడు దశాబ్ధాలుగా రీసెర్చ్ చేస్తున్న ఆయన అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. పశు సంవర్థక, పాడి పరిశ్రమకు చేసిన కృషికిగాను రామారెడ్డికి పద్మశ్రీ పురస్కారం వరించింది.

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వారు:

1.అంకె గౌడ (సాహిత్యం – కర్ణాటక)

2.కుమారస్వామి తంగరాజ్ (హైదరాబాద్)

3.అర్మిడ ఫెర్నాండెజ్ (మహారాష్ట్ర)

4.భగవాన్ దాస్ రాయికర్ (మధ్యప్రదేశ్)

5.భిక్‌ల్యా లదక్య దిండా

6.బ్రిజ్‌లాల్ భట్ (జమ్ము కశ్మీర్)

7.బుద్రి తాటి (ఛత్తీస్‌గడ్)

8.చరణ్ హెబ్రామ్ (ఒడిశా)

9.చిరంజి లాల్‌యాదవ్ (ఉత్తర్‌ప్రదేశ్)

10.ధార్మిక్‌లాల్ చునిలాల్ పాండ్యా (గుజరాత్)

11.గఫ్రుద్దీన్ మెవాటి జోగి

12.హాలీ వార్

13.ఇంద్రజిత్ సింగ్ సిద్ధు

14.కె. పజనీవెల్

15.కైలాశ్ చంద్ర పంత్

16.ఖేమ్ రాజ్ సుంద్రియాల్

17.కొల్లాక్కయిల్ దేవకి అమ్మ జీ

18.కుమారస్వామి తంగరాజ్

19.మహేంద్ర కుమార్ మిశ్రా

20.మిర్ హజీభాయ్ కసమ్‌భాయ్

21.మోహన్ నగర్

22.నరేష్ చంద్ర దేవ్ వర్మ

23.నీలేష్ వినోద్‌చంద్ర మండేవాలా

24.నూరుద్దీన్ అహ్మద్

25.ఒత్తువర్ తిరుత్తణి స్వామి నాథన్

26.పద్మ గుర్మీత్

27.పోకిలా లక్తెపి

28.పుణ్యమూర్తి నటేషణ్

29.ఆర్.కృష్ణన్

30.రఘుపత్ సింగ్

31.రఘువీర్ తుకారామ్ ఖేద్కర్

32.రాజస్తపతి కలిప్ప గౌండర్

33.రామచంద్ర గోడ్‌బోలే – సునీత గోడ్‌బోలే

34.ఎస్‌జీ సుశీలమ్మ

35.సంగ్యుగామ్ పొంజెనర్

36.షఫీ షౌక్

37.శ్రీరంగ్ దేవబ లాద్

38.శ్యామ్ సుందర్

39.సింహాచల్ పాత్రో

40.సురేశ్ హనగవాడి

41.తాగరామ్ భీల్

42.తేచి గుబిన్

43.తిరువయ్యూర్ భక్తవత్సలం

44.విశ్వ బంధు

45.యమున్ జాత్ర సింగ్