Reading Time: < 1 minute

క్రికెట్‌లో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. మ్యాచ్‌లో నెగ్గాలంటే.. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా అంతే ముఖ్యం. ఫీల్డర్ ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్నా.. ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. బ్యాట్స్‌మెన్‌ కూడా ఫీల్డింగ్ పొజిషన్‌ని చూసే షాట్లు ఆడి పరుగులు రాబడతారు. మామూలుగా అయితే.. గ్రౌండ్‌లో 10 మంది ఫీల్డర్లు, ఒక బౌలర్ ఉంటారు. కానీ, ఓ మ్యాచ్‌లో ఒక వ్యక్తి బ్యాటింగ్ చేస్తుంటే.. ఏకంగా 99 మంది ఫీల్డింగ్ చేశారు. అందులోనూ వారందరూ ఇన్‌సైడ్ సర్కిల్‌లో ఫీల్డింగ్ చేయడం మరో విశేషం. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.