
హైదరాబాద్: పంజాగుట్టలోని ఓ కాలేజీలో డ్రగ్స్ కలకలం సృష్టిస్తుంది. ఐదుగురు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. విద్యార్థుల వద్ద నుంచి 10 గ్రాముల ఎండిఎంఎను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు విద్యార్థులు ఒకే కాలేజీకి చెందిన వారిగా గుర్తించారు. గంజాయి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ పిల్లల వద్ద డ్రగ్స్ దొరకడం తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలించాలని డిమాండ్ చేస్తున్నారు.