
పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘దేవగుడి‘. ఈ సినిమాలో అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. ‘దేవగుడి‘ సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. పలువురు సినీ పాత్రికేయుల సమక్షంలో హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ “నిజ జీవిత ఘటనల ఆధారంగా మంచి కథా కథనాలతో ఈ సినిమాను రూపొందించాను. స్క్రీన్ ప్లే చాలా షార్ప్ గా ఉంటుంది. సినిమాలోని ఒక్కో సీన్ అలా వెళ్తూ ఉంటుంది. సాధారణ టికెట్ రేట్స్ తో మా మూవీ ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది”అని అన్నారు. హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ “బెల్లం రామకృష్ణా రెడ్డి ప్రతి సీన్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. చిన్న చిత్రాలను ఆదరిస్తేనే మాలాంటి కొత్త టాలెంట్ బయటకు వస్తుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అనుశ్రీ, రఘుకుంచె, ఎస్‌కే మదీన్, లక్ష్మీకాంత్ కనిక తదితరులు పాల్గొన్నారు.