Reading Time: < 1 minute

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం ’మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. అరుణ్ చిలువేరు, ప్రకాష్ చెరుకూరి సంగీతం సమకూర్చారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా యాంథమ్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో కృష్ణుడు వ్యవసాయం చేస్తున్నట్లుగా చూపించిన విధానం మరింత ఆసక్తిని రేకిస్తుంది. ప్రకాశ్ చెరుకూరి అందించిన మ్యూజిక్ సాంగ్‌కు ప్రాణం పోసింది. బాబా సెహగల్ పాడిన ఈ పాట యూత్‌తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా నిలిచింది.