
మన తెలంగాణ/ నాంపల్లి: నాంపల్లి స్టేషన్ రోడ్డు లో బచాస్ ఫర్నిచర్ క్యాజిల్ దుకాణం, గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తొలుత సె ల్లార్‌లో ఒక్కసారిగా నల్లటి పొగలు, అగ్నికీలలు వ్యాపించి క్రమంగా పైన నాలుగు అంతస్తుల వర కూ ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఫర్నిచర్, వస్తువు లు, ఇతర సామగ్రి అగ్నికీలల్లో బుగ్గిగా మారాయి. రూ.కోట్ల మేర నష్ఠం వాటిల్లినట్టు అంచనా. ఘట న శనివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంటన్న ర సమయంలో సంభవించింది. సెల్లార్‌లో ఇద్దరు చిన్నారులు సహా మరో నలుగురు చిక్కుకున్నారు. వారు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడటంతో.. వారి కుటుంబాల రోదనలు మిన్నంటాయి. రాత్రి సమయం వరకూ లోపలున్నవారి పరిస్థితి స్పష్ఠత లేదు. దీంతో దేవుడిపై భారం వేసి.. టెన్షన్‌కు గురయ్యారు. వారిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చేందుకు ఫైరింజిన్, పోలీసులు, హైడ్రా ఇతర సిబ్బంది శతవిధాలా యత్నిస్తున్నారు. ఈ ఘటన ప్రమాదం గురించి స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..భవనం నిబంధనలకు విరుద్ధంగా కట్టారు. సెట్ బ్యాక్ లేదు. భద్రత పరికరాలు లేవు. దీంతో పోలీసులు, ఫైరింజిన్ సిబ్బంది గంటలపాటు శ్రమించాల్సిన పరిస్థితి.. సెల్లార్‌లో షార్ట్ సర్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్టు అధికారులు భావిస్తున్నారు.
సెల్లార్‌లో మంటలతోపాటు దట్టమైన పొగ వ్యాపించాయి. అక్కడే ఉంటున్న వాచ్‌మెన్ యాదయ్య పిల్లలు అఖిల్(7) ప్రణిత(11) చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు వెళ్లి పలువురు కూడా మంటలు, ఘాటైన పొగకు ఉక్కిరిబిక్కిరై అక్కడే చిక్కుకున్నారు. ఇందులో వృద్ధురాలు సైతం ఉందని పలువురు చెబుతున్నారు. సమాచారం అందగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైరింజిన్లు, హైడ్రా వాహనాలు, అంబులెన్సులను రప్పించారు. ప్రమాదం తీవ్రత.. తీవ్రస్థాయిలో మంటలు నాలుగు వైపులా పైకి ఎగిసి పై అంతస్తులకు వ్యాపించాయి. అందులోంచి పెద్దఎత్తున దట్టమైన పొగతో కూడిన మంటలు చెలరేగాయి. అరుపులు, రోదనలతో భవనంలో మిన్నంటాయి. పై అంతస్తుల్లో ఉన్న సంతోష్ అనే యువకుడు మెట్ల ద్వారా కిందికి సురక్షితంగా వచ్చేశారు. మరికొందరు టెండర్ పేరుతో పిలిచే కుక్కను కూడా కిందికి తీసుకొచ్చారు. మంటలు, పోగలు ఆలుముకోవడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఫర్నీచర్ దుకాణంలో పలువురు మహిళలు బయటికి వచ్చేశారు. లోపల సెల్లార్‌లో ఐదు నుంచి ఆరు మంది వరకు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో సుమారు ఐదు కోట్ల వరకు ఫర్నీచర్లు, వస్తువులు, ఇతర పరికరాలు మంటల దాటికి కాలిపోయాయి.
ఫైరింజన్లతో మంటలు ఆదుపు
నగరంలో వివిధ చోట్ల నుంచి ఒకే సారిగా 15 ఫైరింజిన్లు, హైడ్రా వాహనాలను రంగంలోకి దించారు. పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది. ఇతర శాఖ అధికారులు సమన్వయంతో రెస్యూ ఆపరేషఫన్‌ను ప్రారంభించారు. క్రేన్ సహయంతో స్కై లిఫ్టర్‌తో అద్దాలు ధ్వంసం చేశారు. జేసీబీతో గోడలు బద్దలు కొట్టారు. తర్వాత ఫైరింజిన్ పైపులతో నీళ్లను పైకి అంతస్తులోకి పంపించారు. వెంటనే భయంకర మంటలు, దట్టమైన పొగలతో ఈ ప్రాంతాన్ని చుట్టాముట్టాయి. ఈ ప్రమాదం దృష్టా ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అబిడ్స్ వైపు నుంచి నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్ వచ్చే వాహనాలను నిలిపేశారు. సహాయ చర్యల్లో వివిద శాఖల సిబ్బంది గంటల కొద్ది శ్రమించాల్సి వచ్చింది. పక్కనే ఉన్న భవనాల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు, ఇతరులకు కిందికి వచ్చేశారు. కొన్ని దుకాణాలు మూసేశారు. మంటలు పక్కనే ఉన్న భవనాలకు వ్యాపించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. పక్కనే విద్యుత్ సరఫరాను నిలిపేశారు.
సహాయక చర్యలు సమీక్షించిన సజ్జనార్
ప్రమాదం తీవ్రత దృష్టా లోపలికి, పై అంతస్తులకు దారి లేక లోపల మంటలు, పొగలు వ్యాపించాయి. పైరింజిన్ సిబ్బంది లోపలికి వెళ్లడానికి దారి లేదు. దీంతో వారు రోబో ఫైర్ మిషన్, భారీ క్రేన్, జేసీబీలను ఉపయోగించారు. ఘటనా స్థలికి నగర పోలీస్ కమిషన్ సజ్జనార్ సందర్శించారు. ఆగ్ని ప్రమాదం జరగడానికి వెనకాల కారణాలు అడిగి తెల్సుకున్నారు. అక్కడే ఉండి సహయ చర్యలను సమీక్షించారు. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని, మంటలను త్వరితంగా అదుపులోకి తెచ్చేందుకు అధికారులు అన్నిరకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పక్కనే నూమాయిష్ జరుగుతుండటంతో సందర్శకులు ఒక రోజూ తన పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోవడం నూమాయిష్ వద్ద ట్రాఫిక్ తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, డీసీసీ శిల్పా వల్లి తదితరులు సందర్శించారు.