
అమరావతి: ప్రియుడిపై కోపంతో అతడి ఇంటిని ప్రియురాలు తగలబెట్టిన సంఘటన ఆంధప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుద్దపల్లి గ్రామంలో ప్రియుడు గత కొన్ని రోజులుగా ప్రియురాలును పట్టించుకోవడంలేదు. దీంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో కోపంతో ప్రియురాలు రగిలిపోయింది. దీంతో ప్రియుడి ఇంటిని ప్రియురాలు తగలబెట్టింది. దీంతో ప్రియుడు, అతడి భార్య, కుమారుడితో సహా మరో పది మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.