Reading Time: < 1 minute

అమెరికాలో మంచుతుపాన్ పరిస్థితితో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్, నెవార్క్‌కు ఈ నెల 25, 26 తేదీలలో వెళ్లే విమానాలను నిలిపివేశారు. ఈస్ట్‌కోస్ట్ ప్రాంతంలో మంచు ఉపద్రవంతో పరిస్థితిని విశ్లేషించారు. ముంబై, న్యూఢిల్లీ, నుంచి న్యూయార్క్‌కు రోజువారి విమానాల రాకపోకలు ఉంటాయి. వీటిని నిలిపివేయాల్సి వచ్చింది. ఆదివారం సోమవారం విమానాలు నిలిచిపోతాయని అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి నెవార్క్‌కు వెళ్లే రోజువారి విమానాలు ఆగిపోయ్యాయి. ప్రయాణికులకు ఈ విషయం తెలిపారు. పరిస్థితిని సమీక్షించుకుని తిరిగి ఎప్పుడు విమానాలు తిరుగుతాయనేది తెలియచేస్తారని ప్రకటన వెలువరించారు. సోమవారం వరకూ న్యూజెర్సీ, న్యూయార్క్ ఇతర ప్రాంతాల్లో మంచుతుపాన్ తీవ్రత ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విమానాలను రద్దు చేశామని వివరించారు.