
ప్రతిఘటించిన మహిళపై గొలుసు దొంగ కత్తితో దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలు లోని మంగమూరి రోడ్డులో ఓ కిరాణ దుకాణంలో మహిళ సరుకులు కొనుగొలు చేయడానికి వెళ్తుండగా ఓ దొంగ మహిళ మెడలో బంగారు గొలుసు తెంచుకొని పరారయ్యేందుకు యత్నించాడు. ఈ ఘటనలో మహిళ ప్రతిఘటించడంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం దొంగ పారిపోతుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దొంగను అదుపులోకి తీసుకున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందుతుడు గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.