Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: దేశంలో యువతరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల మెరుగుకే విదేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అత్యంత జాగరూకతతో ఆలోచించుకునే స్పందించడం జరుగుతుంది. దేశాలతో ట్రేడ్, పరస్పర సంచార ఒప్పందాలకు తగు ప్రాధాన్యత ఉంటుందన్నారు. దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ మన యువతకు ఎక్కువ అవకాశాల కల్పనకే టేడ్ డీల్స్ కుదురుతాయని వివరించారు.

శనివారం ప్రధాని మోడీ 18వ రోజ్‌గార్ మేలా సందర్భంగా 61 వేలకు పైగా పలు ప్రభుత్వోద్యోగాలు ఆన్‌లైన్ ప్రక్రియలో పంపించిన దశలో ప్రధాని మాట్లాడారు. దేశాల మధ్య ప్రజల పరస్పర పర్యటనలు అవసరం. యువతకకు ఇది ఉద్యోగ ఉపాధి కల్పనల పటిష్టతకు దారితీస్తుందని చెప్పారు. యువతకు విదేశాలలో అవకాశాల కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని వివరించారు. దేశంలో 45 ప్రాంతాలలో ఈ 18వ రోజ్‌గార్ మేలాను కార్యక్రమం నిర్వహించారు. పలు మంత్రిత్వశాఖలలో ఇప్పుడు ఉద్యోగ నియామక పత్రాలను ప్రధాని పంపించారు.