Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: పఠాన్, జవాన్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.. మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం షారూఖ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ కింగ్. డైరెక్టర్ సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న ఈ మూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటిస్తూ చిన్న గ్లింప్స్ వదిలారు. ఈ ఏడాది చివర డిసెంబర్ 24న క్రిస్మస్ కు కానుగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

కాగా,గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా.. రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, అర్షద్ వార్సీ, రాఘవ్ జుయల్, అభిషేక్ బచ్చన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఈ మూవీతో బాలీవుడ్ లోకి అరంగేట్రం చేయనుంది. ఇదిలావుంటే.. కింగ్ మూవీ రిలీజ్ కు వారం ముందే డిసెంబర్ 18న మార్వెల్స్ అవెంజర్స్: డూమ్స్‌డే విడుదల కానుంది. దీంతో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్, హాలీవుడ్ సూపర్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోరు ఉండనుంది.