
రాత్రికి రాత్రే 10 టన్నులకు పైగా బరువున్న భారీ ఇనుప వంతెన చోరీకి గురైన వింత ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా4లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కోర్బా నగరంలోని ధోధిపారా ప్రాంతంలో ఉన్న హస్డియో లెఫ్ట్ కెనాల్ పై 70 అడుగుల పొడవైన వంతెన నిర్మించారు.ఇది సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన స్టీల్ వంతెన. దీని పొడవు 70 అడుగులు కాగా, వెడల్పు 5 అడుగులు. దీని బరువు దాదాపు 10 నుండి 15 టన్నులు ఉంటుందని అధికారులు అంచనా వేశారు జనవరి 18, 2026 మధ్య రాత్రి ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. జనవరి 18 ఉదయం స్థానికులు చూసేసరికి వంతెన ఉన్న చోట కనిపించలేదు.దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జనవరి 17న రాత్రి సమయంలో దొంగలు
పక్కా ప్లాన్‌తో గ్యాస్ కట్టర్లను ఉపయోగించి వంతెనను ముక్కలుగా కట్ చేశారు.కట్ చేసిన ఇనుప భాగాలను రాత్రికి రాత్రే ట్రక్కుల్లో లోడ్ చేసుకుని పరారయ్యారు. స్క్రాప్ (పాత ఇనుము) విక్రయించే మాఫియా ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు.ఈ చోరీలో దాదాపు 15 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించగా, ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కాలువ లోపల దాచిన సుమారు 7 టన్నుల స్టీల్ మరియు రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్నసూత్రధారులుగా భావిస్తున్న ముఖేష్ సాహు, అస్లాం ఖాన్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో బీహార్‌లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. అక్కడ దొంగలు నీటిపారుదల శాఖ అధికారులమని నమ్మించి మరీ కిలోమీటర్ల పొడవైన వంతెనను కట్ చేసి తీసుకువెళ్లారు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో అలాంటిదే రిపీట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.