
తిరుపతి: నగరిలో టిడిపి ఎంఎల్ఎ గాలి భాను ప్రకాశ్ చేసింది శూన్యమని వైసిపి నేత, మాజీ ఎంఎల్ఎ రోజా విమర్శించారు. నగరిలో చంద్రబాబు పర్యటిస్తుండడంతో ఆమె మీడియాతో మాట్లాడారు. కల్యాణమండపం, సబ్ స్టేషన్, పాలిటెక్నిక్ కాలేజీ, పార్కు, షాదీ మహల్ అన్నీ తామే కట్టామన్నారు. పేదవారికి ఇళ్లతో సహా తామే ఇచ్చామని, చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి టెక్స్‌టైల్ పార్క్ పెడతామని టిడిపి నేతలు చెబుతున్నారని, సిఎం చంద్రబాబు నాయుడు అబద్ధాలు వినలేక ప్రజలు పారిపోయారని, నగరి నియోజకవర్గానికి ఉపయోగపడేది టిడిపి చెప్పినదాంట్లో ఒక్కటి లేదన్నారు.
నగరి టిడిపికి కంచుకోట అని, సూపర్ సిక్స్ ప్రకటిస్తే అసాధ్యం అన్నారని, సూపర్ సిక్స్‌లను సూపర్ హిట్‌గా అమలు చేసి చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పెన్షన్లు, తల్లికి వందనం సహా అన్ని పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఐదేళ్లలో ఎపిని నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.