Reading Time: < 1 minute

రాయ్‌పూర్: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా షహీద్ వీర్‌నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టి-20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. అదే సమరోత్సాహంతో ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన కివీస్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టులో రెండు మార్పులు చేసింది. గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో హర్షిత్ రాణాను, ఇక బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్‌ని జట్టులోకి తీసుకుంది. ఇక న్యూజిలాండ్ జట్టులో మూడు మార్పులు చేసింది. సీఫెర్ట్, ఫౌల్క్స్, మాట్ హర్నీలు కివీస్ జట్టులోకి వచ్చారు.

తుది జట్లు:

భారత్: సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ.