Reading Time: < 1 minute

పుణె: మహారాష్ట్రలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడిని ఓ కారు చిదిమేసింది. పుణెలోని లోనికల్బోర్ ప్రాంతంలోని ఓ నివాస సముదాయంలో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం తన ఇంటి సముదాయంలో ఐదేళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు. కటుంబసభ్యులు కూడా అక్కడే ఉన్నారు. అటువైపుగా దూసుకొచ్చిన ఓ కారు.. అతడి మీద నుంచి వెళ్లిపోయింది. వెంటనే కారు నడుపుతున్న వ్యక్తి దిగొచ్చి, పిల్లాడిని పైకి లేపాడు. బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాల కారణంగా అతడు చనిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడి సిసికెమెరాలో రికార్డు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.