Reading Time: < 1 minute

పాన్ -ఇండియా బ్లాక్‌బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్ ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం ’స్వయంభు’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మిస్తుండగా ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. భారతదేశపు వైభవమైన చరిత్రను, మహోన్నతను సెలబ్రేట్ చేస్తూ రూపొందుతున్న ‘స్వయంభు’ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని ఇంతకు ముందు ప్రకటించారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమా వాయిదా పడినట్టుగా తెలిసింది. స్వయంభూ సినిమాలో గ్రాఫికల్, వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఎక్కువగా ఉన్నాయట. వాటి కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారట మేకర్స్. దీంతో ఈ సినిమా వాయిదా పడిందని సమాచారం. అయితే మార్చి చివరన లేదా ఏప్రిల్ ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందట.