
ఓ చానెల్ మాజీ సిఇఓ రవి ప్రకాష్‌కు మనీలాండరింగ్ కేసులో నాంపల్లి సెషన్స్‌కోర్టు షాక్ ఇచ్చింది. విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఇడి నమోదు చేసిన కేసులో ముద్దాయిగా గుర్తిస్తూ రవి ప్రకాష్‌కు వెయ్యి రూపాయల జరిమానా విధించింది. రవి ప్రకాష్ ఓ చానెల్‌కు సిఇఓగా ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలకు చెందిన రూ. 18 కోట్లకు పైగా డబ్బులను కంపెనీ ఖాతా నుండి విత్ డ్రా చేశారని, వాటికి లెక్కలు చూపలేదని ఆరోపిస్తూ ఇడి కేసు నమోదు చేసింది. అయితే తనపై నమోదైన కేసులో ఇడి విచారణకు హాజరుకాకుండా రవి ప్రకాష్ తప్పించుకుని తిరుగుతున్నాడనే కారణంతో మరో కేసు ఇడి నమోదు చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన నాంపల్లి సెషన్స్ కోర్టు రవి ప్రకాష్‌కు వెయ్యి రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో వారం రోజుల పాటు జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేసింది.