
హైదరాబాద్: న్యూజిలాండ్-టీమిండియా మధ్య జరిగే టి20కి ముందు కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టారు. భారత జట్టు ఓటమిని చవిచూసినప్పుడు గంభీర్ నిర్ణయాలను ఎంతో మంది విమర్శిస్తున్నారని, ఆయన మాత్రం ప్రశాంతంగా, దృఢ సంకల్పం, నిశ్శబ్ధంగా ముందుకు సాగుతున్నారని థరూర్ కొనియాడారు. గంభీర్ సమర్థవంతమైన నాయకత్వానికి అభినందనలు తెలిపారు. భారత దేశ ప్రధాన మంత్రి పదవి తరువాత అతి కష్టమైన ఉద్యోగం గౌతమ్‌దేనని శశి ప్రశంసించారు. గంభీర్‌తో సమావేశం అనంతరం శశిథరూర్ పోస్టు పెట్టారు.
కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ పెట్టిన ట్విట్టర్ పోస్టుకు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రిప్లై ఇచ్చారు. తాను సొంత జట్టుతోనే పోటీలో ఉన్నానని గౌతమ్ స్పందించారు. టీమ్ ఇండియా సభ్యులు సెటిల్ కావడానికి ఇంకాస్త సమయం పడుతుందని, అప్పుడు కోచ్ అపరిమిత అధికారం వచ్చే అవకాశం ఉందన్నారు. తనని సొంత జట్టు సభ్యులకే వ్యతిరేకంగా చూపించడం ఆశ్చర్యానికి గురి చేసిందని గౌతమ్ తెలిపారు. స్వదేశంలో రెండు టెస్టు సిరీస్‌లు కోల్పోవడంతో పాటు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ 2-1 తేడాతో భారత జట్టు కోల్పోవడంతో గంభీర్‌పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. వన్డేలు, టెస్టులకు గంభీర్ కోచ్ గా సమర్ధుడు కాదని క్రికెట్ పండితులు, అభిమానులు స్పష్టం చేశారు. వెంటనే వన్డేలు, టెస్టుల కోచ్ పదవి నుంచి గంభీర్ తొలగించాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. టెస్టులు, వన్డేలలో భారత జట్టు విఫలమవుతున్నాయి విషయం తెలిసిందే.