
మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణిలో దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అరోపించారు. ఎన్నికల ముందు స్కీములు అంటూ ప్రజలను మభ్యపెట్టి, అ ధికారంలోకి వచ్చాక స్కాములకే కాంగ్రెస్ పాల న పరిమితమైందని విమర్శించారు. కోల్ బెల్ట్ నుంచి వచ్చిన ప్రజలు ఈ మోసాన్ని తప్పక గు ర్తించాలని, సింగరేణి అంశమే కాంగ్రెస్ అసలుస్వరూపాన్ని బయటపెడుతోందని స్పష్టం చేశా రు. ఈ అంశంపైన మెత్తం మంత్రులు తేలు కు ట్టిన దొంగళ్ల కనీసం మాట్లాడం లేదని కెటిఅర్ అరోపించారు. ఒక్కో మంత్రి ఒక్కో దేశం పారిపోయాడన్నారు. ఈ స్కాం బయటపడగానే కో మటిరెడ్డి, భట్టి విక్రమార్క ఒకరిని మించి ఒక రు నటించారని, అయితే వారీ మాటల మోసా లు స్కాంను దాచి ఉంచలేవన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మంచిర్యాల జిల్లా అధ్యక్షు డు బాల్క సుమన్ ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ వైస్ ఛైర్మన్ రా జిరెడ్డి, ఆయన అనుచరులు పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి కెటిఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్
పాలనలో స్కీములు మాయమై స్కాములు మాత్రమే మిగిలాయని, ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని, నిజాలు బయటకు రావాల్సిందేనని డిమాండ్ చేశారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ భారీ స్కామ్ బయటపడిందని కెటిఅర్ తెలిపారు. కేసీఆర్ పాలనలో నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తీసుకువచ్చామని, కార్మికులకు ఇచ్చిన 10 హామీల్లో 9 హామీలు అమలు చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ వచ్చాక కొత్త నిబంధనల పేరుతో సింగరేణిని దోచుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ అనే కొత్త నిబంధన తీసుకువచ్చి టెండర్లను కట్టడి చేసిందని విమర్శించారు. గతంలో దేశంలో ఎక్కడున్న కాంట్రాక్టర్ అయినా ఈ-టెండర్ ద్వారా పోటీ పడే అవకాశం ఉండగా ఇప్పుడు తప్పనిసరిగా సైట్‌కు వచ్చి సర్టిఫికేట్ తీసుకోవాల్సిందేనని చెప్పి అవినీతికి తలుపులు తెరిచారని ఆరోపించారు.
దీని ద్వారా ఎవరు టెండర్ వేయాలి, ఎవరు వేయకూడదో ముందే నిర్ణయించే వ్యవస్థ ఏర్పడిందన్నారు. ఈ ప్రక్రియలో ముఖ్యమంత్రి బంధువుల పాత్రపై కెటిఅర్ తీవ్ర ఆరోపణలు చేశారు. మొదటి పెద్ద కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి కంపెనీకే దక్కిందని, రూ.250 కోట్ల కాంట్రాక్ట్ అందుకున్నారని ఆరోపించారు. గతంలో మైనస్‌లో పోయే టెండర్లు ఇప్పుడు వేల కోట్ల విలువైన డీల్స్‌గా మారాయని, ఒక్కో టెండర్‌ను వాటాలు వేసుకుని మరీ పంచుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్ కాంగ్రెస్ నేతలే వాటాల కోసం పరస్పరం కొట్టుకోవడం వల్లే బయటకొచ్చిందని తెలిపారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ వాటాల విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం, మరో మంత్రి మధ్య విభేదాలు బయటపడ్డాయని, ఒకరిపై ఒకరు మీడియా ద్వారా ఆరోపణలు చేసుకున్నారని చెప్పారు. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించగానే ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగిందని ఆరోపించారు. సింగరేణి స్కామ్‌పై సమాధానం చెప్పాల్సిన బదులు, ఫోన్ ట్యాపింగ్ అంటూ పాత సీరియల్‌లా కేసులు లాగుతున్నారని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారానికి రాజకీయ బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.