Reading Time: < 1 minute

ఆర్థిక ఇబ్బందులతో వికలాంగులైన కూతుర్ని చంపి వారు ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు తో మనస్థాపానికి గురైన కుటుంబ సభ్యులు పుట్టుకతో వికలాంగురాలైన కూతురు జావళి (18)ను రెండు రోజుల క్రితం హత్య చేశారు. కూతురు మరణించిన తర్వాత రెండు రోజులుగా ఇంట్లోనే మృతదేహంతో గడిపిన కుటుంబీకులు సతీష్ కుమార్, భార్య ,కొడుకు నితిన్ కుమార్ .ఈ రోజు చేతులు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా విషయాన్ని కుమారుడు నితిన్ తన స్నేహితునికి సమాచారాన్ని తెలియజేశారు. సమాచారం మేరకు జగద్గిరిగుట్ట  పోలీసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మిగితా వారిని చికిత్స నిమిత్తం కూకట్ పల్లి రాందేవ్ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులేనా మరి ఏమైనా సమస్యల అనే కోణంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జగద్గిరిగుట్ట సీఐ వెంకటేశం తెలిపారు.