Reading Time: < 1 minute

నటి టీనా శ్రావ్య మేడారం జాతరలో తన పెంపుడు కుక్కకు మొక్కు చెల్లించడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై ఆమె స్పందిస్తూ క్షమాపణలు కూడా చెప్పారు.కమిటీ కుర్రోళ్లు’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి టీనా శ్రావ్య, ఇటీవల మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె తన పెంపుడు కుక్కను త్రాసులో ఒకవైపు కూర్చోబెట్టి, దానికి సమానమైన బరువుతో బెల్లాన్ని (బంగారం) మొక్కుగా చెల్లించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో

పోస్ట్ చేయడంతో వివాదం మొదలైంది.ఈ వివాదంపై శ్రావ్య స్పందించారు. తాను ఎవరినీ కించపరచాలని అలా చేయలేదని, మరోసారి ఇలాంటి తప్పు చేయనంటూ క్షమాపణలు తెలిపారు.మేడారం జాతర అత్యంత పవిత్రమైన గిరిజన పండుగ అని, అక్కడ జంతువులతో ఇలాంటి తులాభారం నిర్వహించడం ఆచారాలను కించపరచడమేనని భక్తులు మరియు నెటిజన్లు మండిపడ్డారు.ఆదివాసీల సంప్రదాయాలను గౌరవించాలని, ప్రచార పిచ్చితో ఇలాంటి పనులు చేయవద్దని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.