Reading Time: < 1 minute

 భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ తన అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సునీతా విలియమ్స్ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తొలి అంతరిక్ష యాత్రలో భూమిపై భారత దేశాన్ని, స్లోవేనియాను చూశానని తెలిపారు. స్పేస్ లోకి వెళ్లిన వెంటనే తన తల్లిదండ్రుల దేశాలు ఎక్కడ ఉన్నాయని ఆత్రుతగా గమనించానని చెప్పారు. సునీతా తండ్రి గుజరాత్ లోని ఝలసన్ గ్రామానికి చెందినవారు కాగా, తల్లి స్లోవేనియన్ అమెరికన్ మహిళ. అందుకే మొదట ఈ ప్రదేశాల గురించే వెతికాను. చివరకు భూమి అంతా ఒకటే అని తెలుస్తుందన్నారు.అంతరిక్షం నుంచి చూస్తే భూమిపై జీవితంపై అవగాహన మారుతుందని, చిన్న విషయాలపై ఎందుకు వాదించుకుంటామో ఈ గొడవలు చాలా చిన్న విషయాలు కదా అనిపిస్తుందని, ఆమె అన్నారు. వ్యక్తుల మధ్య విభేదాలపై మన అభిప్రాయం మారుస్తుంది. మనమంతా ఒక్కటే కదా, కలిసి మెలసి పనిచేయాలనే భావనను కలిగిస్తుంది. అని ఆమె అన్నారు.