Reading Time: < 1 minute

2024 టి-20 ప్రపంచకప్‌లో భారత్ విశ్వ విజేతగా నిలిచిన తర్వాత టీం ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టి-20 ఫార్మాట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో ప్రారంభంకానున్న టి-20 ప్రపంచకప్‌లో రోహిత్ పాల్గొనే అవకాశం లేదు. టోర్నమెంట్‌ ప్రారంభమైన తొలిసారి దూరం కావడంపై రోహిత్ ఎమోషనల్‌ అయ్యాడు. మొదటిసారి టి-20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఇంట్లో కూర్చొని చూడటం తనకు వింత అనుభవం అవుతుందన్నాడు.

‘‘టి-20 ప్రపంచకప్ గురించి మేం ఇంట్లో మాట్లాడుకుంటున్నాం. ఇంట్లో కూర్చొని మ్యాచ్‌లను చూడటం వింత అనుభవం. ఈ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు నేను ప్రతి ప్రపంచకప్‌లో భాగమయ్యాను. కాబట్టి.. ఇది భిన్నంగా అనిపిస్తుంది. వరల్డ్ కప్‌ను మిస్ అయినప్పుడు మనం అందులో ఆడట్లేదు కదా అని గుర్తొస్తుంది’’ అని రోహిత్ పేర్కొన్నాడు.