
నాగ్‌పూర్: విదర్భా క్రికెట్ అసోసియేషన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టి-20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్‌కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 18 పరుగుల వద్ద సంజూశాంసన్ (10) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే ఇషాన్ కిషన్(8) కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. ఈ క్రమంలో 22 బంతుల్లో అర్థశతకం కూడా సాధించాడు. అయితే శాంట్నర్ వేసిన 11వ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్(32) ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ (67), హార్థిక్ (4) ఉన్నారు.