Reading Time: < 1 minute

దేశంలో కీలకపాత్ర పోషిస్తున్న సింగరేణిని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు.. రాజకీయ ప్రయోగశాలగా మార్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గత పదేళ్లలో బిఆర్ఎస్ ఎలా పని చేసిందో.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే పని చేస్తోందని మండిపడ్డారు. బిఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ కూడా సింగరేణిని విధ్వంసం చేస్తోందని ఆయన ఫైరయ్యారు.

బుధవారం ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కూడా సింగరేణి భాగస్వామ్యమైందని.. తెలంగాణ వచ్చాక సింగరేణికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. లాభాల బాటలో ఉన్న సింగరేణి.. ఇప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడుతోందన్నారు. సింగరేణిలో 51 శాతం తెలంగాణకు, 49 శాతం కేంద్రానికి వాటాలు ఉన్నాయన్నారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కేంద్రం సహకారం అందిస్తోందని చెప్పారు. ఒడిశాలో బిజెపి ప్రభుత్వం వచ్చాక అక్కడి ప్రభుత్వంతో అనుమతులపై చర్చించానని.. నైనీ బొగ్గు గనులకు చివరి అనుమతులు వచ్చాక పనులు ఎందుకు ఆలస్యం చేశారు? కిషన్ రెడ్డి ప్రశ్నించారు.