Reading Time: < 1 minute

ప్రయాగ్‌రాజ్: ఉత్తర్‌ప్రదేశ్‌లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లో మిలిటరీ శిక్షణ విమానం కూలిపోయింది. సాధారణ శిక్షణలో ఉండగా.. స్థానిక కెపి కాలేజీ సమీపంలోని చెరువులో ఆర్మీ విమానం కూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు సుర్క్షితంగా బయటపడ్డారు. ఘటనాస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. అయిత ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది.