Reading Time: < 1 minute

అమరావతి: భూవివాదంలో ఓ వ్యక్తి నలుగురు మహిళలపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముప్పిడి వివేక్ అనే వ్యక్తికి, జీలుగులమ్మ కుటుంబంతో భూవివాదం ఉంది. చుక్కమ్మ, ఉషారాణి, ధనలక్ష్మి, జీలుగులమ్మపై గొడ్డలితో వివేక్ దాడి చేశాడు. జీలుగులమ్మ ఘటనా స్థలంలో మృతి చెందగా మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గత కొన్ని రోజుల నుంచి పొలం సరిహద్దుల గురించి గొడవలు జరుగుతున్నాయి.