
బేగంపేట: హైదరాబాద్ లోని బేగంపేట ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఫ్లైఓవర్ మధ్యలో డివైడర్ ను కారు ఢీకొట్టడంతో పల్టీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. కారు సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తుండగా ఆ ప్రమాదం జరిగింది. రోడ్డు అడ్డంగా కారు పడడంతో రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.