Reading Time: < 1 minute

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. చిరు నెక్ట్స్ ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుండడంతో ఈ ఉగాది తరువాత విడుదలయ్యే అవకాశం ఉంది. దర్శకుడు బాబీ కొల్లితో మెగా 158 అనే వర్కింగ్ టైటిల్‌తో నిర్మిస్తున్న సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్‌కే పరిమితం కాకుండా కుటుంబ సన్నివేశాలు, ఎమోషన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సినిమాలో చిరును కొత్తగా చూపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ప్రియుమణి నటిస్తుండగా చిరుకు కూతురుగా కృతి శెట్టి నటించనున్నట్టు సమాచారం. అతి త్వరంలో బాబీ అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.