
మన తెలంగాణ/కేపీహెచ్‌బి: బాలానగర్ ఐడీపిఎల్ కం పెనీ భూముల అన్యాక్రాంతం, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (టిజీఐఐసీ) ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. నెలరోజుల క్రితం ఐడీపిఎల్ భూముల అ న్యాక్రాంతం విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు కవిత, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప రస్పరం ఆరోపణలు చేసుకున్న నేపధ్యంలో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వి జిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇం దులో భాగంగా ఐడీపీఎల్ భూములకు సంబంధించిన సమగ్ర రిపోర్టు మేడ్చెల్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించగా, వెంటనే టీజీఐఐసి రంగంలోకిదిగి వాస్తవం గా ఉండాల్సిన భూమి, అన్యాక్రాంతమైన భూములను గుర్తించింది. ఫోర్జరీ, తప్పడు డాక్యుమెంట్లతో ఓవర్‌లాపింగ్ భూములను, కంపెనీకి సంబంధించిన భూముల ను అక్రమించుకుని భారీ నిర్మాణాలు చేపడుతున్నారని, పేదల పేర్లతో కొన్నిచోట్ల భూములను అన్యాక్రాంతం చేశారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన టిజీఐఐసి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ సైబారాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఐడీపీఎల్‌కు సంబంధించిన 14ఎకరాల భూమి ఆక్రమించారని, వ్యవహారంలో వివిధ విభాగాల అధికారులు ఆక్రమణదారులతో కుమ్మక్కై పూర్తి అండదండలందించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో టిజీఐఐసి పేర్కొంది. ఐడీపిఎల్, నిప్పర్, రెవిన్యూ అధికారుల పాత్రను స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. ముఖ్యంగా మండల తహశీల్ధార్లతోపాటు వీఆర్‌ఓలు, సర్వేయర్ల పాత్రను ప్రత్యేకంగా పేర్కొన్నట్టు సమాచారం. 2023లో అక్రమంగా ఐడీపీఎల్ భూములకు పాస్‌బుక్స్ జారీ చేయడంలోనూ, పంచనామాలు, సర్వేరికార్డుల్లో అనుమానాస్పద మార్పులు చేసి భూములను కాజేసినట్టు టిజీఐఐసి తమ ఫిర్యాదులో ఆరోపించింది. ఆక్రమణలను అడ్డుకోవడంలో సంబంధిత విభాగాల పైస్థాయి అధికారులు పూర్తిగా విఫలమ్యారని, 2023లో ఐడీపీఎల్ మూతపడటం, భూముల బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, 160 ఎకరాలు, మరో 110 ఎకరాలు నిప్పర్‌కు బదిలీ వ్యవహారంపై,
ఐడీపిఎల్ ఆధీనంలో ఉన్న 195 ఎకరాల భూమికి ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదన్న ఆరోపణలపై టీజీఐఐసి సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుతానికి అందించినట్లు విశ్వసీనయంగా తెలిసింది. టీజీఐఐసి అందించిన సమగ్ర నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ విభాగం అధికారులు విచారణ చేపట్టి అసలు దోషులను గుర్తించి చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. కాగా టిజీఐఐసి ఐడీపిఎల్ భూముల అన్యాక్రాంతపై ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని బాలానగర్ సీఐ నర్సింహారాజు మంగళవారం ‘మన తెలంగాణ’కు తెలిపారు. ఐడీపిఎల్ భూములకు ఆనుకుని ఉన్న సర్వేనెంబరు 376 కూడా ఐడీపీఎల్ కంపెనీ పరిధిలోకి వస్తుంది. ఆ భూముల కబ్జా విషయంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రధాన పాత్ర పోషించినట్లు ఇటీవల జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించింది. భూభారతి రికార్డుల ప్రకారం సర్వే నెంబరు 376 నిషేధిత జాబితాలో ఉంది. ఇందులో సర్వే నెంబరు 376/అ 12.13ఎకరాలు, 376/ఆ లోని 4.7 ఎకరాలు రైల్వేలైన్‌గా పహాణీల్లో ఉంది. గత బీఆర్‌ఎస్ హయాంలో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి సర్వే నెంబరు 376లోని 17 ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అన్ని అధికార వ్యవస్థలూ, నాయకులు పూర్తి సహకరం అందించారన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి.
నాయకులు, అధికారులు అందించిన అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసిన ప్లాట్లలో ఇప్పుడు భారీ నిర్మాణాలు, అందులో చిన్నతరహా పరిశ్రమలు నడుస్తున్నాయి. కమర్షియల్ నిర్మాణాలు వెలిసి పూర్తిస్థాయి కమర్షియల్ ప్రాంతంగా అభివృద్ది చెందింది. ఇదిలాఉండగా ఐడీపిఎల్ భూములకు అనుకుని ఉన్న సర్వే నెంబరు 252లోని భూమిని కొంతమంది చదను చేసి ప్లాట్లు చేసి విక్రయించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు ఐడీపిఎల్‌కు పక్కనే ఉన్న భూధాన బోర్డుకు చెందిన భూమిని కొల్లగొట్టడానికి బోర్డు ముసుగులో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, నాయకులు, ప్రజాప్రతినిధులు చేయని ప్రయత్నం లేదు. ఈ భూమి కొల్లగొట్టే విషయంలో నాయకులు, సదరు వ్యక్తుల మధ్య డీల్ కుదరక పోవడంతో ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడితో అప్పట్లో పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదుకావడం, హైకోర్టు క్యాష్ చేయడం జరగింది. కోట్లాది రూపాయల భూమి విషయంలో ఐడీపిఎల్, భూధాన్ బోర్డుల మద్య ఓవర్‌లాపింగ్ వివాదం రెవిన్యూ కోర్టుల చుట్టూ తిరుగుతొంది. మరోవైపు ఈ భూములను తమకు అప్పట్లో వ్యవసాయం చేసుకోవడానికి భూదాన్‌బోర్డు దానం ఇచ్చిందని అది తమకే చెందుతుందని కొంతమంది వ్యక్తులు కోర్టుల్లో కేసులు నడిపిస్తున్నారు.