
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: దేశంలో కార్పోరేట్ శక్తులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సవాళ్ళు విసురుతున్నాయని.. అందరం కలిసిగట్టుగా తిప్పికొట్టాల్సిన అవశ్యకత ఏర్పడిందని రాష్ట్ర డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సిపిఐ శత వసంతాల ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఖమ్మం నగరంలో ఎస్‌ఆర్ గార్డెన్‌లో ‘నేటి భారతదేశం -వామపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అంశంపై ఏర్పాటు చేసిన జా తీయ సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. సిపిఐ జాతీయ ప్రధా న కార్యదర్శి డి.రాజా, సిపిఎం జాతీ య ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ జాతీయ కా ర్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, అబిండియా ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ కార్యద ర్శి జి.దేవరాజన్ తదితర వామపక్ష నే తలు పాల్గొన్న సెమినార్‌లో భట్టి మా ట్లాడుతూ.. మతం అనే సెంటిమెంటు తో ప్రస్తుతం దేశంలో ఆర్థిక, సామాజి క అంశాలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కార్పొరే ట్, ఫాసిస్టు శక్తుల వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమా దం పొంచి ఉందన్నారు. దోపిడీ వర్గాలు, దోపిడీకి గురయ్యే వర్గాలమధ్య కాకుండా దేశంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వామపక్షా లు ముందుకు కదలాలన్నారు.
వర్గ పోరాటం ద్వారానే సోషలిజం సాధ్యమని కార్ల్ మార్క్స్ చెప్పాడు కానీ, భారతదేశం మార్క్స్ అంచనాలకు మినహాయింపుగా మిగిలింది భారతదేశ సమాజం వర్గాలపై కాకుండా కులాలపై నిర్మితమైందని జర్మన్ ఫిలాసఫర్ మార్క్స్ వెబర్ స్పష్టంగా చెప్పాడని సెమినార్లో డిప్యూటీ సీఎం వివరించారు. వర్గ పోరు అనేది లేకుండా చేసి పార్లమెంటు వ్యవస్థ ప్రశ్నార్ధకమైన నేపథ్యంలో కమ్యూనిస్టుల పాత్ర ఈ దేశంలో చాలా ప్రముఖమైనదని తెలిపారు. ఖమ్మం జిల్లా అనేక రకాల భావజాలాల వ్యాప్తికి ఆహ్వానం పలుకుతుందని, ఆతిథ్యానికి మారుపేరు ఖమ్మం అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వామపక్షా నేతలు ఖమ్మం జిల్లాలో సమావేశం కావడానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని, అభినందిస్తున్నానని అన్నారు. వందేళ్ల సిపిఐ చరిత్రలో ఎన్నో త్యాగాలు, ఆటుపోట్లు ఉన్నాయి. ఈ దేశానికి స్వాతంత్రం సాధించడంలో సిపిఐది ప్రముఖస్థానమన్నారు. భారతదేశం అంతటికీ 1947లో స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతానికి ఒక సంవత్సరం తర్వాత స్వాతంత్రం సిద్ధించింది. నిరంకుశ నిజాం రాజును వ్యతిరేకించి కమ్యూనిస్టులు చేసిన సాయుధ పోరాటం ప్రపంచానికి కొత్త సందేశాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు.
భూమికోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం.. దున్నేవానిదే భూమి, గ్రంథాలయ ఉద్యమం వంటి గొప్ప పోరాటాలతో తెలంగాణ విలసిల్లిందన్నారు. ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో ఏ ఇంటి తలుపు తట్టిన ఒక పోరాట గాధ వినిపిస్తుందన్నారు. కాంగ్రెస్ పాలకులు బూర్గుల రామకృష్ణారావు 1950లో కౌలుదారీ చట్టాన్ని తీసుకువచ్చారు. ఆ తర్వాత అందులో 1970లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం, పేదల అభివృద్ధికి 20 సూత్రాల పథకం, బ్యాంకుల జాతీయ కరణ, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం వంటి గొప్ప చట్టాలను వామపక్ష పార్టీల సహాయంతో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దేశంలో, రాష్ట్రంలో తీసుకు రాగలిగాయన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. లేదంటే సగటుకు మనిషికి హక్కులు దక్కకుండా పోతాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓటు హక్కును నాశనం చేస్తుంది. రాజ్యాంగంలో మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి ఈ దేశంలో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. దేశంలో ఆర్థిక సామాజిక అంశాలను తప్పుదోవ పట్టిస్తున్న ఆ శక్తులకు ఐక్య పోరాటాల ద్వారా అడ్డుకట్ట వేద్దాం. కలసి ముందుకు పోదామని వామపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. సదస్సుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షత వహించగా డాక్టర్ కె నారాయణ, ప్రకాశ్ బాబు, జాతీయ కమిటీ సభ్యులతోపాటు జిల్లాకు చెందిన సిపిఐ ,సిపిఎం నాయకులు పాల్గొన్నారు.