
కడవరకు తోడు ఉంటానని మూడు మూళ్లు వేసిన భర్త, భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని రోకలిబండతో హత్య చేసిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం…వనపర్తికి చెందిన రొడ్డ ఆంజనేయులు(43), నాగర్ కర్నూలుకు చెందిన సరస్వతి(42)కి 14 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి బాబు(11), పాప(9) ఉన్నారు, ఆంజనేయులు కార్ల కొనుగోలు చేసి రీసేల్ చేస్తుంటాడు. ఆంజనేయులు స్నేహితులతో కలిసి వ్యాపారం చేస్తుంటాడు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఆంజనేయులు తరచూ భార్యతో గొడవపడేవాడు. భర్త వేధింపులను తట్టుకోలేక సర్వతి 20 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆంజనేయులు, సరస్వతి ఇంటికి వెళ్లి సర్ధిచెప్పి తీసుకుని ఏడు రోజుల క్రితం తీసుకుని వచ్చాడు.
ఈ క్రమంలోనే సోమవారం రాత్రి సర్వతి నిద్రిస్తుండగా రాత్రి 11.30 గంటలకు రోకలి బండతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. తర్వాత బయటికి వెళ్లిపోతున్నట్లు ఆంజనేయులు పిల్లలకు చెప్పి బయటికి వెళ్లిపోవడంతో అనుమానం వచ్చిన పిల్లలు లైట్ వేసి చూడగా తల్లి సర్వసతి రక్తం మడుగులో పడిఉంది. వెంటనే పిల్లలు తన మేనమామ ప్రశాంత్‌కు ఫోన్ చేసి చెప్పారు, అతడు నమ్మకుండా వీడియో కాల్ చేయాలని చెప్పడంతో పిల్లలు చేశారు. వీడియో కాల్‌లో చూసిన ప్రశాంత్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు చెప్పాడు. ఆంజనేయులు గతంలో తన బావమర్ది ప్రశాంత్‌ను కత్తితో పొడవడంతో కేసు నమోదైంది. భార్యను చంపిన నిందితుడు వాట్సాప్ స్టేటస్‌లో తన భార్యను చంపిన విషయం స్టేటస్‌గా పెట్టుకున్నాడు. భార్యను చంపి పరారైన నిందితుడి కోసం బోరబండ పోలీసులు గాలిస్తున్నారు.
ఆగ్రహంతో ఆమెపై రోకలి బండతో దాడి చేశాడు. దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ బోరబండ అహ్మద్‌నగర్ డివిజన్‌లోని రాజీవ్ నగర్‌లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భార్య సరస్వతి(35)పై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య తరచూ ఘర్షణ జరిగేది. అలాగే మంగళవారం మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన భర్త.. భార్య తలపై రొకలి బండతో బలంగా కొట్టాడు. తలకు తీవ్ర గాయం కావడంతో.. ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్‌ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా స్థానికులను విచారిస్తున్నారు పోలీస్ అధికారులు.