
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘటం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కలెక్టర్లతో ఎస్ఇసి రాణికుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. బుధవారం ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, జిల్లాల కలెక్టర్లతో విసి నిర్వహించనున్నారు. గురువారం ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, కలెక్టర్లతో, ఈ నెల 23న రంగారెడ్డి, మేడ్చల్, ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లతో ఎస్ఇసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై చర్చించనున్నారు. ఈ నెల 24న లేదా 27న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.