
మాజీ మంత్రి హరీష్‌రావు సిట్ విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు అడ్డుకుని చెదరగొట్టారు.సాయంత్రం మరోమారు భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. దీంతో పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌లకు తరలించారు. సిట్ విచారణలో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు హరీష్‌రావు విచ్చేయడంతో బిఆర్‌ఎస్ కార్యకర్తలూ భారీగా తరలివచ్చారు. స్టేషన్ ముందు భారీగా పోలీసు బలగాలను ఏర్పాటుచేసినా ఒక దశలో కార్యకర్తలను అదుపుచేయడం కష్టం కావడంతో ప్రత్యేక బలగాలను రప్పించి భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటు పోలీసులు,అటు బిఆర్‌ఎస్ కార్యకర్తల వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు రణరంగాన్ని తలపించింది.