
ఢిల్లీ: సింగరేణిలో బిఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకల గురించి ఎంక్వైరీ జరగాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్ర మంత్రుల మధ్య గొడవలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నైనీ బ్లాక్ లో ఏం జరిగింతో తెలంగాణ ప్రజలకు తెలియాలని, అన్నింటిపైనా సమగ్ర విచారణ జరగాలని కోరారు. ప్రభుత్వం ఏ దర్యాప్తు సంస్థకిచ్చినా బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మొదలు పెట్టాలని, టెండర్లు ఎవరికి ఇచ్చారు.. ఎందుకు క్యాన్సిల్ చేశారని.. అన్ని బయటపెట్టాలని అన్నారు. రెండేళ్లైనా ఫోన్ ట్యాపింగ్ లో ఇంకా దర్యాప్తు జరుగుతూనే ఉందని, రాజకీయ నేతలు ఎవరిని అరెస్టు చేశారు? అని రాంచందర్ ప్రశ్నించారు. బెంగాల్ లో పరిస్థితులు వేరు, తెలంగాణలో పరిస్థితులు వేరు.. సింగరేణి అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అని తెలియజేశారు. ఒక్క ఉద్యోగిని కూడా కేంద్రప్రభుత్వం నియమించలేదని, అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ లేదు కాబట్టి కేంద్రం ఏం చేయలేదని రాంచందర్ రావు పేర్కొన్నారు.