
కోల్‌కతా: పశ్చిమ బెంగాళ్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) జరుగుతున్న ప్రక్రియలో భాగంగా పలువురు ప్రముఖులకు ఎన్నికల అధికారుల నుంచి నోటీసులు అందిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీకి కూడా నోటీసులు వచ్చాయి. దీంతో కోల్‌కతాలోని బిక్రంగఢ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఎన్నికల సంఘం అధికారుల ముందు షమీ విచారణకు హాజరై.. సంబంధిత డాక్యుమెంట్లు అందజేశాడు.
‘సర్’ దరఖాస్తులో మహ్మద్ షమీ పేర్కొన్న వివరాల్లో కొన్ని చోట్ల వ్యత్యాసాలు కనిపించాయని అందుకే విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు ఇసికి చెందిన సీనియర్ అధికారులు పేర్కొన్నారు. ఇదివరకే ఒకసారి నోటీసులు ఇచ్చినప్పటికీ.. క్రికెట్ మ్యాచ్ కారణంగా మరోసారి అవకాశం ఇచ్చామని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన షమీ.. క్రికెట్ కోసం తన మకాంను కోల్‌కతాకి మార్చాడు. ఈ క్రమంలో 93వ వార్డులో ఓటరుగా నమోదు చేసుకున్నాడు. ఈ వార్డు రాస్‌బిహారీ అసెంబ్లీ స్థానం పరిధిలోకి వస్తుంది.