Reading Time: < 1 minute

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు వింటేజ్ చిరంజీవిని చూశామంటూ కితాబు ఇస్తున్నారు. సెలబ్రటీలు సైతం ఈ చిత్రంలో చిరు పెర్ఫామెన్స్‌కి ఫిదా అయిపోయారు. ముఖ్యంగా చిరంజీవి, వెంకటేశ్‌ల కాంబినేషన్‌లో ఉన్న సన్నివేశాలు.. థియేటర్ల‌లో ఫ్యాన్స్ చేత ఈలలు వేయించాయి.

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాకు తనదైన స్టైల్‌లో రివ్యూ ఇచ్చాడు. ముందుగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టీం అందరికీ శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్.. సినిమాలో చిరంజీవిని వింటేజ్ వైబ్స్‌లో చూసి చాలా సంతోషం కలిగిందని అన్నాడు. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అని పేర్కొన్నాడు. వెంకటేష్ కూడా చాలా బాగా నటించారని తెలిపారు. నయనతార, క్యాథరీన్‌ల స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని.. మిగితా ఆర్టిస్టులు ముఖ్యంగా సంక్రాంతి స్టార్ బుల్లిరాజు అదరగొట్టారని కితాబిచ్చాడు.

‘హుక్ స్టెప్’, ‘మెగా విక్టరీ’ పాటలకు అందించిన భీమ్స్‌కి అభినందనలు తెలిపాడు. నిర్మాతలు సుస్మిత, సాహు గారపాటిని ప్రశంసించాడు. ఇక అనిల్ రావిపూడిని సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మిషెన్ అని పేర్కొన్నాడు. ‘సంక్రాంతికి వస్తారు-హిట్ కొడతారు-రిపీట్’ అని అనిల్‌ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక ఈ సినిమా సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదని.. ఇది సంక్రాంతి ‘బాస్’ బస్టర్ అని బన్నీ రాసుకొచ్చాడు.