Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ టెస్టులు, టి-20లకు రిటైర్‌మెంట్ ప్రకటించి.. ప్రస్తుతం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన్డేల్లో తన సత్తా చాటుతున్నాడు ‘కింగ్’. న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీ అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో కోహ్లీపై గతంలో విమర్శలు చేసిన మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేర్‌‌పై విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘క్రికెట్‌లో సులువైన ఫార్మాట్ గురంచి మిస్టర్ ఎక్స్‌పర్ట్ ఆఫ్ క్రికెట్ కొన్ని సూచనలు ఇస్తారా అని నేను ఆశ్చర్యపోతున్నాను. అలా చేయడానికి మీరు అక్కడ ఉండాలి. ఏది ఏమైనా.. చెప్పడం ఎవరికైనా సులువే. చేయడమే కష్టం’’ అని వికాస్ తన థ్రెడ్స్‌ ఖాతాలో రాసుకొచ్చాడు.