Reading Time: < 1 minute

హైదరాబాద్: కట్టుకున్న భార్యనే దారుణంగా హత్య చేశాడో భర్త. ఈ విషాద సంఘటన హైదరాబాద్ సిటీలోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోరబండ పిఎస్‌ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో సోమవారం అర్ధరాత్రి భార్య సరస్వతి(32) నిద్రిస్తుండగా..భర్త అంజనేయులు(43) రోకలిబండతో ఆమె తలపై కొట్టి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన నిందితుడికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.