Reading Time: < 1 minute

అమరావతి: శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వాసవీ పెనుగొండగా ప్రభుత్వం.. పేరు మార్చి ఆర్యవైశ్యులపై ఉన్న ప్రేమను చాటుకుందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరిగింది. త్యాగం, సత్యం, ధర్మానికి ప్రతీకగా నిలిచిన వాసవీమాతకు ఘన నివాళులర్పించారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు నిమ్మల దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మార్పణ అంటే మరణం కాదు.. ధర్మం కోసం చేసిన పరమ త్యాగం అని..వాసవీ అమ్మవారు అబల కాదు.. ఆదిశక్తి, స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచారని విశ్వసించారు. వాసవీ అమ్మవారి సందేశం ఏ కులానికో, మతానికో పరిమితం కాదని, సమాజంలో శాంతి, ఐక్యత, సత్యమార్గం నిలవాలని నిమ్మల రామానాయుడు కోరారు.