Reading Time: < 1 minute

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా మాజీమంత్రి హరీష్ రావు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపటక్రితం ఆయన తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ లోని సిట్ ఆఫీస్ కు వెళ్లారు. అయితే, హరీష్ రావు వెంట న్యాయవాదులను కార్యాలయంలోకి పోలీసులు అనుమతించలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు నిన్న నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో హరీష్ రావు విచారణకు హాజరయ్యారు.