
నవరసరాయ డాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ’శుభకృత్ నామ సంవత్సరం’. ఎస్‌ఎస్ సజ్జన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వి పిక్చర్స్, అవిష్క డ్రీ ప్రొడక్షన్ బ్యానర్స్ పై డిఆర్ విశ్వనాథ్ నాయక్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్‌లో డాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ “శుభకృత్ నామ సంవత్సరం కథ చాలా నచ్చింది. అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఇందులో డ్రామా, సస్పెన్స్, ట్రావెల్ అన్ని అద్భుతంగా ఉంటాయి. చాలా వేరియేషన్స్ ఉన్న సినిమా. తెలుగు, కన్నడలో చాలా మంచి స్టార్ కాస్ట్ తో వస్తున్న సినిమా ఇది”అని అన్నారు. డైరెక్టర్ సజ్జన్ మాట్లాడుతూ “నరేష్ గోల్డెన్ ఇయర్ సినిమా చేయడం నా అదృష్టం. ఈ సినిమాలో నరేష్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. చాలా అద్భుతమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా అందరినీ అలరించేలా ఉంటుంది”అని పేర్కొన్నారు. నిర్మాత విశ్వనాధ్ నాయక్ మాట్లాడుతూ చాలా మంచి కథతో ఈ సినిమా తీస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, హీరో శ్రీ విష్ణు, పవిత్ర లోకేష్, రామ్ అబ్బరాజు, రాజేష్ దండా పాల్గొన్నారు.