
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం వనదేవతల దర్శనం ముగించుకొని సోమవా రం హెలికాప్టర్‌లో నేరుగా శంషాబాద్ విమానాశ్రయాని కి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. మేడా రంలో అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్న అనంతరం సిఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. దావోస్ పర్యటన లో భాగంగా ముఖ్యమంత్రి పలువురు గ్లోబల్ సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాల్లో పాల్గొననున్నా రు. నాలుగు రోజుల పాటు సాగే ఈ టూర్ షెడ్యూల్‌లో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రే వంత్ రెడ్డి వివరించనున్నారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, లైఫ్ సై న్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. ‘
ఈ పర్యటనలో ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు కూడా పా ల్గొననున్నారు. దావోస్‌లో జరిగే సదస్సులో ప్రపంచ దేశా ల ప్రభుత్వాలు, కార్పొరేట్ దిగ్గజాలు, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ నాయకులు, విధాన రూపకర్తలు కలిసే అత్యం త ప్రభావవంతమైన వేదికగా నిలువనుంది. పెట్టుబడుల ఒప్పందాలు, భాగస్వామ్యాలు, భవిష్యత్ ఆర్థిక వ్యూహాల పై ఇక్కడ చర్చలు జరుగనున్నాయి. గతంలో జరిగిన దావోస్ పెట్టుబడుల సదస్సుకు రెండుసార్లు హాజరైన రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికను సమర్థవంతంగా వినియోగించుకొని పెట్టుబడులను రాబట్టింది. ఈ నేపథ్యంలోనే మూడో పర్యటనను మరింత వ్యూహాత్మకంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం ఏఐ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు బహుముఖ ఎజెండాతో సాధారణ ప్రజేంటేషన్‌తో కాకుండా రంగాలవారీగా స్పష్టమైన కార్యాచరణతో ముందుళుతోంది.
దావోస్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం
ప్రపంచ పెట్టుబడులకు కేరాఫ్ అయిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు సర్వం సిద్ధమైంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం (ఈనెల 19వ తేదీ) నుంచి ఈ నెల 23వ తేదీ వరకు ఈ ప్రతిష్టాత్మక సదస్సు జరుగనుంది. ఈ వేదిక నుంచి మరోసారి పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. సిఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బృందం గతేడాది దావోస్ వేదికగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించగా ఈ సారి గతం కన్నా ఎక్కువ పెట్టుబడులు రాబట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం దావోస్ టూర్‌కు వెళ్లింది.
నాలుగు కీలక రంగాలపై ఫోకస్
దావోస్ సదస్సు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా నాలుగు కీలక రంగాలపై ఫోకస్ పెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో హైదరాబాద్‌ను దేశంలోనే ప్రముఖ ఏఐ హబ్‌గా నిలబెట్టే దిశగా గ్లోబల్ టెక్ సంస్థల ఆర్ అండ్ డి కేంద్రాలు, డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం దావోస్ పర్యటనకు వెళ్లింది. సెమీకండక్టర్ -ఎలక్ట్రానిక్స్ రంగంలో చిప్ డిజైన్ సెంటర్లు, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు, సప్లై చైన్ భాగస్వామ్యాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్చలు జరుపనుంది.
ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు సిఎం విదేశీ పర్యటన
దావోస్ పర్యటన అనంతరం వారం రోజులపాటు ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సు చేసేందుకు సిఎం రేవంత్‌రెడ్డి అమెరికా బోస్టన్‌లోని హార్‌వర్డ్ బిజినెస్ స్కూల్‌కు వెళ్తున్నారు. దీంతో ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు సిఎం విదేశీ పర్యటనలో ఉంటారు.