
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణ ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసును వచ్చే నెల 6వ తేదీలోగా తేల్చాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మార్‌కు సుప్రీంకోర్టు గడువు విధిస్తూ ఆదేశించిం ది. బిఆర్‌ఎస్ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే దానం నాగేందర్ కొంత కాలానికే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పో టీ చేశారని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయ స్థానం తీవ్రంగా స్పందించిం ది. లోక్‌సభకు దానం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం బహిరంగ రహస్యమే అయినా, స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని పిటిషనర్ ఏలేటి తరపున న్యాయవాది వాదన వినిపించారు.