Reading Time: 2 minutes

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది సుజన్‌రెడ్డికి సంబంధించిన బొగ్గు కుంభకోణం బయటపడటంతో, దా ని నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఫోన్ ట్యాపింగ్ అంశం లో నోటీసులు ఇచ్చి అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. రాజకీయ వేధింపులే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య మాత్రమేనని సాక్షా త్తూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. అత్యున్నత న్యాయస్థానమే ఆ కేసును కొట్టేసి, ఈ పొలిటికల్ డ్రామాకు తె రదించినా.. మళ్లీ ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోందని విమర్శించారు. అసలు ఈ నోటీసుల వెను క ఉన్న కారణం ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయిందని అన్నారు. ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి బావమరిది సుజన్‌రెడ్డికి అడ్డగోలుగా జరిగిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణా న్ని తాము సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టామని,

ఈ భారీ స్కామ్ నుండి తప్పించుకోవడానికే రాత్రికి రాత్రే హరీష్ రావుకు నోటీసులు పంపారని ఆరోపించారు. ఇది పక్కాగా రేవంత్ రెడ్డి మార్క్ డైవర్షన్ పాలిటిక్స్ అని ఎద్దేవా చేశా రు. అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి ప్రతిపక్ష నేతలపై బురద చల్లడం, నోటీసులతో బెదిరించడం ఈ ప్రభుత్వానికి అ లవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. హరీశ్‌రావు తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు నిరంతరం ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడు అని, అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన చూపిస్తున్న చొరవను చూసి రేవంత్‌రెడ్డికి వణుకు పుడుతోందని అన్నారు. అందుకే రాజకీయంగా ఎదుర్కోలేక, పాతపడిపోయిన కేసులతో ఇబ్బం ది పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. గత 24 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు చట్టం పైన, న్యాయస్థానాల పైన పూర్తి గౌరవం ఉందని, ఏ విచారణకైనా తాము సిద్ధం అని స్పష్టం చేశారు. నోటీసులతో ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూడటం భ్రమ మాత్రమేనని హెచ్చరించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజల పక్షాన రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని వేటాడటం ఆపేది లేదని, కుంభకోణాలను బయటపెడుతూనే ఉంటామని కెటిఆర్ స్పష్టం చేశారు.